11 June, 2026 | 1:14 AM

రోడ్డు కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

11-06-2026 12:00 AM

ఘన చరిత్ర కలిగిన పోచమ్మ గుడి

కొత్తగూడెం, జూన్ 10 (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, రామవరం 15వ డివిజన్ కొత్తూరు రాజాం బస్తి పోచమ్మ గుడి ఏరియాలో, కొలువై ఉన్న పోచమ్మ తల్లి ఆలయం నుండి విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని, నూతనంగా రోడ్డు ఏర్పాటు చేసి బస్తీ వాసుల కోరికను నెరవేర్చాలని, పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం తరపున, బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు, వినతి పత్రం అందజేశారు స్థానికులు.

ప్రజల మనిషిగా ప్రజల బాగోగులు కోరే నిత్యం, ప్రజా సేవకుడిగా, పిలిస్తే పలికే ప్రజా వారధిగా సామాన్యుడిని సైతం తన హృదయ స్పందనతో స్పందింపజేసే ఏకైక ఎమ్మెల్యే కూనంనేని కి, స్థానిక ప్రజలు బాధను విన్నవించుకున్నారు. కొత్తూరు రాజo బస్తి ఏరియాలో అంబులెన్స్‌కు మార్గం లేకపోవడం పలువురి హృదయాలను కలిచి వేస్తుంది. సరైన రహదారి ఏర్పాటు చేసి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచమ్మ తల్లి దేవాలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు రహదారి నిర్మాణం చేపట్టి బస్తి ప్రజల కష్టాలకు మార్గం చూపాలని, ఎమ్మెల్యేను కోరారు.

రోడ్డుకు అనుకూలమైన స్థలం, ముదిరాజ్ భవనం పక్కన కావలసిన అంత  ఉందని, అందులో కొద్దిగా అంబులెన్స్ రాకపోకలకు అనుకూలమైన రోడ్డుకు అవసరమైన స్థలం కేటాయించాలని కోరారు. ప్రజల అవసర నిమిత్తం రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో కొత్తూరి మదనయ్య, రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు, ముస్తఫా ,కొత్తూరి రవికుమార్, సంపత్ కుమార్, చుక్కయ్య ,పెరక కిరణ్,  కొమ్ము శివ, దాసారపు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.