calender_icon.png 11 November, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్ పై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి: బిజెపి

10-11-2025 11:04:39 PM

ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): ఖమ్మం 1వ పట్టణ అధ్యక్షులు గడీల నరేష్ అధ్యక్షతన 1వ పట్టణ సిఐని కలిసి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ప్ లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం వినతిపత్రం అందజేశారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ వారి ఫోటోని సామజిక మధ్యమాలలో గ్రూప్ లలో పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా స్థానిక బైపాస్ రోడ్డు ఏరియా వేణుగోపాల్ నగర్ రోడ్డు నెంబర్-1 లో నివాసముంటున్న వ్యక్తి రెచ్చగొట్టే విధముగా పోస్ట్ లు పెట్టినందున అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు గడీల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా, జిల్లా నాయకులు మంద సరస్వతి, పొట్టిమూతి జనార్దన్, బండారు శ్రీనివాస్, మండల నాయకులు పాలేపు రాము, పొట్టిమూతి వాణి, ఊరుకొండ ఖాదర్, మేడ సంపత్, బొల్లోజు మనోజ్ పాల్గొనటం జరిగింది.