calender_icon.png 11 November, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా కవరింగ్!

11-11-2025 12:00:00 AM

* కనిపించని ప్లాస్టిక్ నిషేధం

* విచ్చల విడిగన్వినియోగం

* జాడ లేని తనిఖీలు

* పర్యావరణం పైతీవ్రప్రభావం

మణుగూరు,నవంబర్10,(విజయ క్రాంతి) : ప్రజల దైనందిక జీవనంలో భాగమైన ప్లాస్టిక్ ఓ వైపు పర్యావరణాన్ని నాశ నం చేస్తూ ప్రజలను విషవలయంలోకి నెడుతోంది. నింగి,నేల,గాలి, నీరులను కలుషితం చేస్తూ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది. నాజూగ్గా ఉందని, తేలిక పాటిదని పాలిథిన్ కవర్ల వాడకానికి ప్రజలు అలవాటు పడిపోయారు. ఖాళీ చేతులతో వెళ్లడం ఎలాంటి వ స్తువునైనా పాలిథిన్ కవర్లలో తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. అయితే పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని ఎవరూ గుర్తించ లేకపోతున్నారు. ఫలితంగా ప్రజారోగ్యాలపై విషం చిమ్ముతున్న ప్లాస్టిక్ భూతంపై విజయక్రాంతి ప్రత్యేక కథనం...

పెరుగుతున్న వినియోగం..

పారిశ్రామిక ప్రగతితో మణుగూరు పట్ట ణం రోజు రోజుకూ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో వ్యాపారాలు పెరిగి పోయాయి. దీంతో మున్సిపాలిటీతో పాటు పలు పంచాయతీలలోని గ్రామాలలోప్లాస్టిక్ వినియోగం పెరిగింది. గ్రామాల్లో, పట్టణం లో నిషేధిత ప్లాస్టిక్ను కిరాణం, వర్తక వాణిజ్య వ్యాపారులు తమ నిత్య వ్యాపారంలో అడ్డుఅదుపు లేకుండా వినియోగిస్తున్నారు. ఫలి తంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి.పట్టణంలో కుడా ప్లాస్టిక్ ని షేధం అమలులో ఉన్నప్పటికి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి పాలిథీన్ కవ ర్లు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ హోల్సేల్ షాపులపై ఇంతవరకు అధికారులు దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. కిళ్ళీ కొట్టు నుంచి సూపర్మార్కెట్ వరకు ప్లాస్టిక్ విక్రయాలు యథే చ్చగా సాగుతున్నాయి.

జాడ లేని తనిఖీలు...

పురపాలక శాఖ అధికారులు నిషేధిత ప్లాస్టిక్ ను వాడితే జరిమానాలు విధిస్తామ ని, ఆయా దుకాణాలను సీజ్ చేస్తామని చె బుతున్న మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 125 మై క్రాన్లకంటే తక్కువగల ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించారు. కానీ అధికార యం త్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మున్సిపల్ సిబ్బంది నామమాత్రం తనిఖీలకే పరిమి తమవుతున్నారు. ప్లాస్టిక్ విని యోగంపై వచ్చిన ఆంక్షలు కొద్దిరోజులపా టు అమలు చేశారు. అయితే ఆ చర్యలు పూర్తిగా మూన్నాళ్ల ముచ్చటగానే మారాయి. మళ్లీ యధావిధి గానే ప్లాస్టిక్ సంచిల వినియోగం అడ్డు అదుపు లేకుండా సాగుతోం ది. ఇందుకు డంపింగ్ యార్డ్ లోని క్వింటాళ్ల కొద్దీ కనబడుతున్న సంచులే పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

ఉత్తమాటగా మారిన నిషేధం.. 

ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు వివరించి మార్పు తీసుకురావాల్సిన మున్సిపల్ అధికారులు ఆ దిశగా విఫలం చెందారని విమ ర్శలు ఉన్నాయి. ఫలితంగా పట్టణ శివారు ప్రాంతంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. జ్యూస్ పాయింట్లు, హోటల్లు, వివిధ రకాల షాపుల్లో వీటి వినియోగం నిత్యకృత్యమై పోయింది. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసిన పార్సిల్ చేయడం కోసం ప్లాస్టిక్ కవర్ అవసరంగా మారిపోయింది.

మృత్యువాత పడుతున్న మూగజీవాలు..

ప్రజలు వాడిపడేసే కవర్లలోని పండ్లను తినేందుకు వచ్చిన పశువులు పండ్లతో పా టు కవర్ను తింటున్నాయి. దీంతో పశువుల కడుపులోకి వెళ్లిన ప్లాస్టిక్ విషంగా మారి అవి మృత్యువాత పడటం ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు వాడి పడేసిన ప్లాస్టి క్ వ్యర్ధాలు  పంట భూముల్లోకి తాగునీరు అందించే చెరువులు, కుంటల్లోకి చేరుకుం టూ జల కాలుష్యానికి కారణం అవుతోంది. జ లచ రాలకు మరణ శాసనం రాస్తుంది. ఇ న్ని దుష్ఫలితాలు చోటు చేసుకునే ప్లాస్టిక్ ని వారణపై యంత్రాంగం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తుందని విమర్శలు పర్యా వరణ శాస్త్రవేత్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా స్పందించి మేల్కోవాలి

ప్లాస్టిక్ వినియోగంపై అటు అధికారులు, ఇటు ప్రజలు పూర్తిస్థాయిలో మేల్కోవాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగిన ట్లు ప్రజల అవగాహన, క్రమశిక్షణ, అధి కారుల శ్రద్ధ దాడులు నిషేధాజ్ఞలను అమలుకు నో చు కుంటాయన్నది నిర్వివాదాంశం. మునిసిపల్, పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ , కస్టమ్స్ ల శా ఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పరిస్థితిని అదు పులోకి తీసుకురావా లని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అదే సమయం లో ప్రజల్లోనూ సైతం అవగాహన కల్పించి ప్లాస్టిక్ కవర్ల ని కాకుండా ప్లాస్టిక్ సంబంధించిన వాటిని పూర్తిస్థాయిలో తరి మికొట్టేందుకు చర్యలు చేపట్టేం దుకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.