17 April, 2026 | 11:30 AM

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలి

11-06-2025 01:23 AM

కొండాపూర్, జూన్ 10 : రైతులు విత్తనాలు నాటే సమయాన్ని అదనుగా చూసి నకిలీ విత్తన వ్యాపారులు నకిలీ విత్తనాలు,  పురుగుమందులు అమ్ముతూ రైతులను ఆగం చేస్తున్నారని, కొండాపూర్ మండలంలో ఉపాధి కూలీలకు మూడు నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించడం లేదని సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ దశరథ్ అన్నారు.

మంగళవారం మండల కేంద్రమైన  కొండాపూర్ లో నకిలీ పురుగు మందులు అమ్ముతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో  తహసీల్దార్ అశోక్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి దశరథ్ మాట్లాడుతూ కొండాపూర్ మండలంలో నకిలీ విత్తన వ్యాపారులు చెలరేగిపోతున్నారని,  విత్తనాలు ఎరువుల కృత్రిమ కొరతను డీలర్లు సృష్టిస్తుంటారని రైతులను మోసం చేయకుండా వ్యవసాయ శాఖ, పోలీస్, టాస్క్ ఫోర్స్ అధికారులు పిడి యాక్ట్ నమోదు చేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు చంద్రయ్య, అంజయ్య, రామస్వామి, మొగులయ్య, భరత్  పాల్గొన్నారు.