27 April, 2026 | 7:16 PM

సీబీఐ విచారణ కోరినా కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు?

27-04-2026 03:51 PM

కాళేశ్వరం విషయంలో కోర్టు తీర్పుపై రేవంత్ స్పందన

కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నివేదికను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్  చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Project) అంశంలో పీసీ ఘోష కమిషన్ నివేదికలో సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందని తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు వద్దని కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే  చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సీబీఐ విచారణపై(CBI Inquiry) కోర్టులో బీఆర్ఎస్ కు ఉపశమనం దక్కలేదని సూచించారు. సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, సీబీఐ వివరాలు కోరితే అన్ని ఇస్తామని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ మొదలైతే అన్ని బయటకు వస్తాయని వెల్లడించారు. సీబీఐ విచారణ కోరితే 48 గంటల్లోనే లోపల వేస్తామన్నారు.. సీబీఐ విచారణ కోరినా కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అని రేవంత్ ప్రశ్నించారు. సీబీఐ విచారణ కోసం కేంద్రం వద్దకు వెళ్తామన్నారు.