27 April, 2026 | 7:14 PM

అంబర్‌పేటలో అగ్నిప్రమాదం

27-04-2026 04:05 PM

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో(Amberpet) సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. అంబర్ పేట్ చే నంబర్ కూడలి వద్ద షోరూమ్ లో మంటలు అంటుకున్నాయి. మహీంద్ర షోరూమ్(Mahindra Showroom) లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మహీంద్ర షోరూమ్ పక్కనే నివాస సముదాయాలున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో చుట్టుపక్కల పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. మంటలను గమనించిన సిబ్బంది, స్థానికులు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో హూటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుతోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్త చేస్తున్నారు.