బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్
10-07-2026 07:33 PM
ఉప్పల్,(విజయక్రాంతి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ అన్నారు. నాచార పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న తాటికాయల సతీష్ ఎండి సల్మాన్ పై ఈ-పేటీట కేసులను నమోదు చేసి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో వారికి న్యాయస్థానం రెండు రోజుల స్వచ్ఛభారత్ కమ్యూనిటీ సర్వీస్ శిక్షణను విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన గొడవలు పడిన మహిళలను వేధించిన కఠిన చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ హెచ్చరించారు.






