సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని సుల్తానాబాద్ (నల్లవాగు) TGSWRS బాలుర హాస్టల్‌లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ నిఖిత, వైద్య సిబ్బంది విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రక్తపోటు, హీమోగ్లోబిన్, ఎత్తు, బరువు తదితర అంశాలను పరిశీలించారు. అనారోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు అవసరమైన వైద్య సూచనలు అందించడంతో పాటు, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, వైద్య సిబ్బంది, సిబ్బంది సభ్యులు పాల్గొని విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MLHP జైరామ్, MPHEO చెంద్రశేఖర్, HA రాంచందర్, భాను స్టాఫ్ నర్స్, తిరుపతి ప్రిన్సిపాల్ ఉన్నారు.






