18 March, 2026 | 3:46 AM

ఎల్పీజీ గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

18-03-2026 12:36 AM

నిర్మల్, మార్చి ౧7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కృత్రిమంగా కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని ఎల్పీజీ గ్యాస్ గోదామును సరఫరా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సిలిండర్ కోసం వచ్చిన బాధితులతో మాట్లాడారు.

జిల్లాలో సిలిండర్ల కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. అన్ని గోదాముల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో ఉందని దొరకదేమో అన్న భయంతో ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారని కలెక్టర్ వెల్లడించారు. సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్, ఆర్డీవో రత్న కళ్యాణి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.