మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్‌కు కన్నీటి వీడ్కోలు
ఆదిలాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : ఖానాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ సీనియర్ నేత అజ్మీర గోవింద్ నాయక్ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్వగ్రామమైన మండలంలోని లింగాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఆదిలాబాద్ జిల్లా నరేష్ జాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన అభిమానుల అశ్రునయనాల మధ్య గోవింద్ నాయక్ అంత్యక్రియలు జరిగాయి. ముందుగా గోవింద్ నాయక్ భౌతిక కాయానికి నేతలు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ మంత్రి రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌లు పాడే మోస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.




