14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు

25-02-2026 08:02 PM

* బాల్య వివాహాలపై అవగాహన కై ప్రచార రథం ప్రారంభం

* బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యత

* చిన్నారుల బాల్యాన్ని పరిరక్షించుకుందాం

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): బాల్య వివాహాలను చేసిన, ప్రోత్సహించిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ షేర్ ఎన్టీవో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథాన్ని వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాల్యం అమూల్యమైన దశ అని అన్నారు. బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక-మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. చదువు మధ్యలో ఆగిపోవడం వల్ల జీవితాంతం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి రవి, ఎన్హెచ్టియు ఇన్స్ స్పెక్టర్ శ్యామ్ సుందర్, ఎస్.ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్చంద సంస్థ జిల్లాల కో-ఆర్డినేటర్ శిరీష, జ్యానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.