calender_icon.png 8 October, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

08-10-2025 12:52:00 AM

పోతారంలో గ్రామస్తులకు అవగాహన సదస్సులో ఎస్‌ఐ రవికుమార్

మంథని,ముత్తారం, అక్టోబర్ 7 (విజయ క్రాంతి):  శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవు ముత్తారం ఎస్త్స్ర రవి కుమార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పోతారం గ్రామస్తులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు.

త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలోని ప్రజానీకంతో మమేకమై అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులను అధ్యయనం చేసి ఎలాంటి గొడవలు సమస్యలు తలెత్తకుండా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గొడవలకు దూరంగా ఉండాలని, అందరూ సోదర భావంతో మెలగాలని, ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని గ్రామ ప్రజానీకం సహకరించాలని అన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్త్స్ర రవికుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విపిఓ శ్రావణ్ రెడ్డి, పోలీసు సిబ్బంది రాజు, సుమంత్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.