calender_icon.png 8 October, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీటీసీ, ఎంపీటీసీలను కైవసం చేసుకోవాలి

08-10-2025 12:50:35 AM

మాజీ మంత్రి చంద్రశేఖర్ 

జహీరాబాద్, అక్టోబరు 7 :స్థానిక సంస్థల ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎ.చంద్రశేఖర్ అన్నారు. మం గళవారం జహీరాబాద్ లో పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం, కోహిర్, జహీరాబాద్ మండలాలలోని జడ్పీటీసీ, ఎంపిటిసి స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలు పునిచ్చారు.

కార్యకర్తలు, నాయకులు పోటీ పడకుండా పార్టీ ఆదేశించిన వారికి అందరూ పనిచేసి గెలుపును కృషి చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్, నాయకులు ముబీన్, నాగిశెట్టి, మాణిక్యమ్మ, ఎం.జి రాములు, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి కండెం నరసింహులు, జ్యోతి, ఆస్మా తభస్సుం, భీమయ్య, అక్బర్, జమీలుద్దీన్, కార్యకర్తలు పాల్గొన్నారు.