calender_icon.png 8 October, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో గురుకుల విద్యార్థి మృతి

08-10-2025 12:52:20 AM

- క్లాస్ రూం కారిడార్‌లో మెడకు బిగుసుకున్న నైలాన్ దారం

-  హత్యా? ఆత్మహత్యా?  ప్రమాదవశాత్తు మరణమా? అనే కోణంలో పోలీసుల విచారణ

-  ప్రిన్సిపాల్, టీచర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, స్టూడెంట్స్ ధర్నా

-  తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్

- గురుకులాల భద్రతపై మరో ప్రశ్నను లేవనెత్తిన సంఘటన

హుస్నాబాద్, సెప్టెంబర్ 7 : సిద్దిపేట జి ల్లా  హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సనా దుల వివేక్ (13) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. క్లాస్ రూం కారిడార్ లో కట్టి ఉన్న  నైలాన్ దారం మెడ కు బిగుసుకొని మరణించాడు.  దసరా సెలవుల తర్వాత తిరిగి పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థి, ఒక్క రోజు గడవక ముందే ప్రాణా లు కోల్పోవడం తల్లిదండ్రులను, బంధువులను శోకసంద్రంలో ముంచింది.

పాఠశాల ఉపాధ్యాయుల వాదనలకు, వివేక్ తండ్రి ఆవేదనకు మధ్య ఉన్న వైరుధ్యం ఈ కేసును మరింత జటిలం చేస్తోంది. పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం క్లాసులు ప్రారంభం కాగా, బ్రేక్ టైంలో వివేక్ ను తన తోటి స్టూడెంట్ ఒకరు వాష్ రూంకు వెళ్దామని బలవంతం చేశాడు. తాను రానని, ను వ్వు వెళ్లు అని వివేక్ పాఠశాల భవనం రెండో అంతస్తు కారిడార్లో ఉన్నాడు. వాష్ రూంకు వెళ్లిన స్టూడెంట్ తిరిగి వచ్చేసరికి వివేక్ నిర్జీవంగా పడి ఉన్నాడు. దీంతో ఆ విద్యార్థి వెళ్లి టీచర్లకు చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి వివేక్ మెడకు నైలాన్ దారం బిగుసుకొని ఉంది. వెంటనే వారు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించాడని నిర్ధారించారు.

పాఠశాల ఉ పాధ్యాయులు చెబుతున్న దాని ప్రకారం, ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న తాడు మెడకు చుట్టుకోవడంతో, ఉరి బిగుసుకుపోవడం వల్ల వివేక్ మరణించాడు. వెంటనే అతడిని హుస్నాబాద్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. వివేక్ తండ్రి మాత్రం ఉపాధ్యాయుల వాదనపై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కు ఫోన్ చేసినప్పుడు కేవలం కింద పడ్డాడని, గాయాలయ్యాయని మాత్రమే చెప్పారని, ఆసుపత్రికి వెళ్లేసరికి తన కొడుకు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరయ్యాడు. తాడు మెడకు చుట్టుకుని ఉరి బిగుసుకుందనే కీలక విషయాన్ని దాచి, కేవలం కింద పడ్డాడని చెప్పాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఎం దుకు వచ్చిందనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.

తల్లిదండ్రులు, స్టూడెంట్స్ ధర్నా

వివేక్ మరణానికి కారణమైన అంశాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పాఠశాల వద్ద సిద్దిపేట-హనుమకొండ రహదా రిపై ధర్నా నిర్వహించారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి, తమ బిడ్డ మరణానికి గల కారణాలు తెలపాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 6న ఆనందంగా బడికి వెళ్లిన వివేక్, మరుసటి రోజే నిర్జీవ దేహంగా మారిపోవడం తల్లిదండ్రుల గుండెలను చీల్చింది. నా బిడ్డ కిందపడ్డాడని చెప్పా రు... కానీ ఆసుపత్రికి రాగానే చనిపోయి ఉన్నాడు! అంటూ వివేక్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.  ఒక్క రోజు ముందు నవ్వుతూ మాట్లాడిన బిడ్డ... మరుసటి రోజు ఇలా కనిపిస్తాడా? అని తల్లి విలపించడం అక్కడ ఉన్నవారిని కన్నీరు పెట్టించింది. ఏసీపీ సదానందం పోలీసు సిబ్బందితో వచ్చి బాధితులను సముదాయించారు.

పోలీసుల విచారణపైనే ఆశ

విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మరణం హత్యా? ఆత్మహత్యా?  ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉన్న ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం, అనంతరం ఉపాధ్యాయుల వాదన ల్లో పొంతన లేకపోవడం గురుకులాల్లోని విద్యార్థుల భద్రతపై మరోసారి ప్రశ్నను లేవనెత్తింది. ఈ చిన్నారి ప్రాణం ఎలా పోయిందో తెలుసుకునేందుకు ఇప్పుడు అంతా పోలీసుల దర్యాప్తు వైపు ఆశగా చూస్తున్నారు.

గురుకుల భద్రతపై ప్రశ్నార్థక చిహ్నం

గురుకుల పాఠశాలలు  పేద పిల్లలకు ఉత్తమ విద్య, సురక్షిత వసతి కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యంతో నడుస్తున్నా, తరచూ ఇలాంటి విషాద సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గత మూ డు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా గురుకులాల్లో విద్యార్థుల అనూహ్య మరణాలు, మానసిక ఒత్తిడి ఘటనలు నమోదు అయ్యాయి.విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై పాఠశాలలలో పర్యవేక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ ఘటన మరోసారి చూపించింది.