జకార్తాను రక్షించుకోలేమా?

01-05-2024 12:10:00 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్ప దేశమైన ఇండోనేషియా రాజధాని జకార్తా నగరం సముద్ర మట్టాల పెరుగుదల బారిన పూర్తిగా పడటానికి ఇంకెంతో కాలం పట్టేలా లేదని వస్తున్న వార్తలు మానవతావాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్రస్థాయి వాతావరణ మార్పులు ద్వీపదేశాలు, సముద్ర తీర ప్రాంతాలకు మృత్యుఘంటికలను మోగిస్తున్న తీరు భయానకంగా ఉంది. జకార్తాలో ఇప్పటికే చాలావరకు కట్టడాలు మునిగిపోయాయని, మరో పాతికేళ్లలో నగరం కనీసం మూడోవంతు మునిగి పోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

బి.విరించి, సిద్దిపేట