06-12-2025 08:29:34 PM
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
పాపన్నపేట: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. శనివారం పాపన్నపేట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి పేజ్ ఎలక్షన్ల కోసం నామినేషన్ పూర్తయ్యాయని, ఆయా గ్రామాల్లో క్యాంపియన్ నడుస్తుందన్నారు. మొదటి పేజ్ ఎన్నికల కోసం డిసెంబర్ 11 పోలింగ్ ఉన్నందున డిసెంబర్ 10 రోజున ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని ఆదేశించారు. మొదటి ఫేజ్ లో ఆరు మండలాలో సర్పంచి వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలను అత్యంత పారదర్శకంగా జరగాలని తెలిపారు.
మొదటి పేజ్ లో 14 గ్రామపంచాయతీల సర్పంచి, వార్డు సభ్యుల, ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తయిన కూడా ఆయా గ్రామాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందన్నారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎన్నికల నియమాలు పాటించి నిబంధన మేరకే ప్రచారం చేయాలన్నారు. గ్రామాల్లో వంద శాతం ఓటింగ్ సాధించాలన్నారు. అలాంటి గ్రామ పంచాయతీలను ఘనంగా సన్మానించి ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలిపారు. ఓటింగ్ లో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు గురికాకుండా గ్రామ, వార్డు అభివృద్ధికి ఎవరైతే తోడ్పడేవారు ఉంటారో వారిని నిజమైన సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సిబ్బంది ఉన్నారు.