18 April, 2026 | 11:50 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులకు పాల్పడితే చర్యలు

19-06-2025 01:15 AM

తాడ్వాయి, జూన్, 18( విజయ క్రాంతి ): ప్రైవేటు పాఠశాలలో అధిక పీజుల వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ రామస్వామి తెలిపారు కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ఆయన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేయవద్దని సూచించారు విద్యా కమిటీ ఆదేశాల మేరకే పాఠశాల నిర్వహణ కొనసాగాలని కోరారు పాఠశాలలో పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాంలు అమ్మినట్లయితే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు