calender_icon.png 10 July, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

10-07-2025 12:05:05 AM

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశం 

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన యూరియాను, సకాలంలో రాష్ట్రానికి తెప్పించడంతో పాటు జిల్లాల అవసరానికి అనుగుణంగా పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు సూచించారు. ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.

రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఉండొద్దని, డీలర్లు ఎక్కడైనా అధిక ధరలకు విక్రయించినా, ఇతర ప్రొడక్ట్ లింక్ పెట్టినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూ చించారు. రాష్ట్రంలో  ఉన్న రామగుండం ఎరువుల కంపెనీ నుంచి కేటాయింపులను 3 వేల నుంచి 6 వేల టన్నులకు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి జూలై నెల వరకు 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరి యా వచ్చే వరకు నిత్యం కేంద్రమంత్రిత్వ శాఖ ప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నా రు. రైతులు కూడా అవసరమైన మేరకే యూరియా కొనుగోలు చేయాలన్నారు.