calender_icon.png 10 July, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించాలి

10-07-2025 12:05:10 AM

  1. దేశ వ్యాప్తంగా టాప్5 ర్యాంకింగ్లో 

గట్టు మండలం రావడం హర్షించ దగ్గ విషయం....

పలు అంశాలపై అధికారులతో దిశ సమావేశం...

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి

గద్వాల, జూలై 9 : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ ఫలాలను అధికారులు సమిష్టి సహకారంతో పనిచేసి లబ్ధిదారులకు అందించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్య, వైద్య గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయం,గ్రామీణ అభివృద్ధి, బ్యాంకర్లు, పంచాయతీ రాజ్,శిశు సంక్షేమం,పౌర సరఫరాలు, పరిశ్రమల శాఖల అధికారులతో వారు చేపట్టిన పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎం.పి. మల్లు రవి మాట్లాడుతూ, నీతి ఆయోగ్ దేశ వ్యాప్తంగా టాప్5 ర్యాంకింగ్లో గట్టు బ్లాక్ స్థానాన్ని సాధించడం పట్ల అభినందనలు తెలియజేస్తూ, ఈ ఘనతకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు.

బ్యాంకర్లు జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు విరివిగా రుణాలను అందించాలన్నారు .వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించే విధంగా పంట రుణాలు, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు విరివిగా రుణాలు అందించాలని జాతీయ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులకు సూచించారు. ఎర్రవల్లి, ధరూర్ మండల కేంద్రాలలో కొత్తగా ఎస్. బి.ఐ. బ్రాంచ్ లను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.

డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు బ్యాంకర్లు సత్వర చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు గ్రామీణ అభివృద్ధి క్రింద జిల్లాలో 1.56 లక్షల జాబ్ కార్డ్ లు జారీ చేయడం జరిగిందన్నారు. గత మూడు మాసాలుగా ఉపాధి హామీ పథకం కింద 2,074 పని దినాలు కల్పించి రోజుకు రూ. 307/- రూపాయల చొప్పున మొత్తం 14.45 కోట్ల రూపాయలను కూలీలకు దినసరి భత్యం అందించడం జరుగుతుందన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో వ్యవసాయ శాఖలో ఆరు వేల మంది రైతుల పంట పొలాల మట్టి నమూనాల సేకరించి సాయిల్ హెల్త్ క్రింద హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.

వైద్య శాఖ ఆధ్వర్యంలో ఎన్ సి డి కార్యక్రమం కింద మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయడం జరుగుతుందన్నారు జిల్లాలో 10 పి హెచ్ సి లు, 57 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 3,328 మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్సలను అందజేయడం జరిగిందని తెలియజేశారు.

విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 12 కేజీబీవీ పాఠశాలల్లో 3994 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 255 గ్రామపంచాయతీలు, హాబిడేషన్ లకు ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరును అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.

ఈ కార్యక్రమంలో అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, కలెక్టర్ సంతోష్, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు,దిశ కమిటీ సభ్యులు సరిత, గిరిబాబు, శంకర్,రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.