5 March, 2026 | 12:12 PM

మెడికల్ వ్యర్థాలు కలిపితే చర్యలు

05-03-2026 12:00 AM
  1. ఈ-వేస్ట్ అందజేసే ప్రజలకు నగదు, డిస్కౌంట్ కూపన్లు

వంద శాతం ఈ-వేస్ట్, బయోమెడికల్ వ్యర్థాల సేకరణే లక్ష్యం  

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ-వేస్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బయోమెడికల్ వైద్య వ్యర్థాల నిర్వహణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో 100 శాతం ఈ-వేస్ట్, బయోమెడికల్ వ్యర్థాల సేకరణే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకె ళ్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టం చేశారు. మున్సిపల్ చెత్తతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయోమెడికల్ వ్యర్థాలను కలపకూడదని, ఈ నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులు, సంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఆయన   హెచ్చరించారు.

బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ-వేస్ట్ రీసైక్లర్లు, బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగస్వాములతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. క్యూర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లలో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేసేందుకు రూపొందిం చిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై  సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భం గా కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ బయోమెడికల్ వ్యర్థాల సేకరణలో ఏమా త్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. నిబంధనల ప్రకారం వ్యర్థాలను శాస్త్రీయంగా తరలించని ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలకు వెంటనే నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణ హితం గా మార్చేందుకు నగరవాసులంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా నగరంలో రోజురోజుకూ పేరుకుపోతున్న ఈ-వేస్ట్ పాత టీవీలు, మొబైల్స్, కంప్యూటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు నిర్వహణకు సంబంధించి ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి కార్యాచరణను వివరించారు. దీనికి అదనంగా ప్రతి శని, ఆదివా రాల్లో క్యూర్ పరిధిలోని 300 వార్డుల్లో వార్డు స్థాయి సేకరణ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ-వేస్ట్ ఇస్తే.. నగదు, కూపన్లు.. ఈ-వేస్ట్ ఇచ్చే ప్రజలను ప్రోత్సహించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న ఆలోచన చేసింది.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు.. వ్యర్థాలు అందజేసిన పౌరులకు యూపీఐ ద్వారా నగదు చెల్లించడం లేదా సీఎస్‌ఆర్ కింద రిడీమబుల్ కూపన్లు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమి షనర్ శానిటేషన్ రవికిరణ్ మాట్లాడుతూ వ్యర్థాల సేకరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను జీహెచ్‌ఎంసీ కల్పిస్తుందని, ప్రజలకు ఇచ్చే నగదు,

చెల్లింపులు, ప్రోత్సాహకాల బాధ్యత పూర్తిగా రీసైక్లింగ్ సంస్థలదేనని స్పష్టం చేశారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ హెల్త్ అదనపు కమిషనర్ ప్రియాంక అల, శానిటేషన్ అదనపు కమిషనర్లు రవి కిరణ్, రఘు ప్రసాద్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఎస్‌ఈ సృజన శ్రీలత,పలు ఈ-వేస్ట్, బయోమెడికల్ హ్యాండ్లింగ్ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.