ఆత్మగానైనా తిరిగొస్తా!
నా ఒంట్లో బలం లేకపోవచ్చు..
మనోబలం మాత్రం వెరవలేదు..
20న పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొంటా..
ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ మార్చ్ లో పాల్గొనేందుకైనాతాను ప్రాణాలతోనే ఉంటానని, అది సాధ్యంకాకపోతే ఆత్మగానై నా తిరిగొస్తానని పర్యావరణ ఉద్యమకారు డు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపా లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చే యాలని డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తాను బలహీనంగా కనిపిస్తున్నా, మనోబలం మాత్రం ఏమాత్ర తగ్గలేదన్నారు. పార్లమెంట్ మార్చ్ లో పెద్ద ఎత్తున ప్రజలు హాజ రయ్యేలా చూడాలని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నేతలకు, విద్యార్థులకు పిలుపు నిచ్చారు. మ రోవైపు ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండ డంపై వైద్యులు దీక్ష విరమించాలని కోరిన ప్పటికీ వాంగ్‌చుక్ కొనసాగించాలని నిర్ణ యించుకున్నారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. వాంగ్‌చుక్‌ను ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ కలిసి తమ మద్దతు ప్రకటించారు.






