వైభవంగా బోనాల జాతర
18-07-2026 01:47 AM
నిర్మల్ జులై 17 ( విజయక్రాంతి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో శుక్రవారం బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్య లో తరలివచ్చి బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనా లు వేస్తే వర్షాలు కురిసి పాడిపంటలు పం డుతాయి అని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఉత్సవ ఊరేగింపు నిర్వహించగా శివ సత్తుల విన్యాసాలు పోతరాజుల ప్రదర్శన వ ఆకట్టుకున్నాయి.






