నితిన్ జోరు.. రుక్మిణి తోడు!
హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొత్త దర్శకులు నారి, సోము దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరో రెండు ప్రాజెక్టులనూ నితిన్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి ‘ఆయ్’ ఫేమ్ అంజి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కాగా, మరో చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
నితిన్, అంజి కాంబో సినిమాను శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ నిర్మించనుందని, ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇక డైరెక్టర్ మురళీకాంత్ తెరకెక్కించనున్న సినిమాకు కూడా నితిన్ ఇప్పటికే పచ్చజెండా ఊపారు. హీరో నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందనున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుందని, షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే కథ చెప్పగా.. తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన రుక్మిణి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






