కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి) మే 19: ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐతోపాటు మిత్రపక్షాలు బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే సాబీర్‌పాషా పిలుపునిచ్చారు. కొత్తగూడంలోని ఎంపీ పొం గులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం లో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వతహాగా జర్నలిస్టు అయిన మల్లన్నకు ప్రజా సమస్యలు, పట్టభద్రుల సమస్యలపై విస్తృతమైన అవగాహన ఉంటుందన్నారు. ఆయన గెలిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎవరికీ ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. సమావేశంలో నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, నాగసీతారాములు పాల్గొన్నారు.






