మోదీ పాలనలో దేశాభివృద్ధి
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
హనుమకొండ, మే 19 (విజయక్రాంతి): మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభి వృద్ధి సాధించిందని వరంగల్, ఖమ్మం, నల్ల గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని బాలస ముద్రం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్ర భుత్వం పేదలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అంది స్తున్న విషయం గుర్తు చేశారు. రైల్వే లను అభివృద్థి పథంలో తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్ని కల్లో ఒక్క సీ టు మాత్రమే గెలిచిన బీజేపీని ప్రజలు క్ర మంగా ఆదరిస్తున్నారని తెలిపారు. కేం ద్రంలో మరోసారి రాబోయేదీ బీజేపీ ప్రభు త్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్, రిజర్వే షన్లు మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాం గ్రెస్ అభ్యర్థికి వాళ్ల పార్టీ నాయకులే మద్దతు తెలపడం లేదని అన్నారు. తన బలం, బల గం కార్యకర్తలేనని, వాళ్లే తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శు లు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి బొళ్ల అమర్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు దయాసాగర్, గడ్డం రాజి రెడ్డి పాల్గొన్నారు.






