29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్ట్

27-09-2024 02:51 AM

కోర్టు వాయిదాలకు వరుసగా గైర్హాజరు

అరెస్ట్ వారెంట్ జారీచేసిన న్యాయస్థానం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): డ్రగ్స్ కేసులో నిందితుడైన సినీ నటుడు అభిషేక్‌ను గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో అభిషేక్‌పై డ్రగ్స్ రవాణా, విక్రయంపై కేసులు ఉన్నాయి. నిందితుడు కొన్ని కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో అతడిపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ  చేసింది. అభిషేక్ గోవాలో రెస్టారెంట్ నిర్వహి స్తున్నట్లు గుర్తించిన యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యేక బృందం గోవా వెళ్లి అతడిని అరెస్ట్ చేసి గురువారం  హైదరాబాద్ సీసీఎస్‌కు తీసుకువచ్చారు. కాగా 2012లో అభిషేక్ కారులో డ్రగ్స్ ప్యాకెట్లతో సహా పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  ఈ కేసులోనే తాజాగా పోలీసులు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.