calender_icon.png 20 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోయిన్స్ అందంగా కనిపించాలనేం లేదు

19-12-2025 12:00:00 AM

నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ తెలిపింది కథానాయకి ఫరియా. 

‘గుర్రం పాపిరెడ్డి’లో నేను సౌధామిని అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నా. సౌధామిని ఓ నర్స్. డాక్టర్ చదు వుకోవాలనుకుంటుంది. గుర్రం పాపిరెడ్డి పరిచయమై తన కథంతా మార్చేస్తాడు. తెలివైనవారు, తెలివి తక్కువవారి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. 

ఈ సినిమాలో వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తా. యాక్టర్స్‌కు ఇలా విభిన్నమైన మేకోవర్స్‌లో కనిపించే అవకాశం తక్కువసార్లు వస్తుంది. ‘జాతిరత్నాలు’ చిట్టితో సౌధామినిని పోల్చలేం. చిట్టి అమాయకురాలు, సౌధామిని ఇంటెలిజెంట్‌గా ఉంటుంది.  

వరుసగా ఎంటర్‌టైనింగ్ మూవీస్‌లోనే నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ జానర్ సినిమాలంటే నాకు ఇష్టం. అందుకే వాటిని రిజెక్ట్ చేయడం లేదు. నాకు ఇంటెన్స్ క్యారెక్టర్స్ కూడా చేయాలనుంది. ‘భగవంతుడు’లో బలమైన పాత్ర పోషిస్తున్నా. విలేజ్ గర్ల్‌గా డిఫరెంట్‌గా కనిపిస్తా. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది.  

అన్ని రకాల జానర్స్ మూవీస్ చేయాలనే కోరిక ఉంది. యాక్షన్ హీరోయిన్, సీరియల్ కిల్లర్.. వంటి డార్క్ మూవీస్ చేయాలని ఉంది. హీరోయిన్స్ అంటే అందంగా కనిపించాలనేం లేదు. యాక్షన్ మూవీస్ కూడా బాగుంటాయి. ‘జాతిరత్నాలు’ తర్వాత అలాంటి ఇంపాక్ట్ ఉండే రోల్స్ రాలేదనే రిగ్రెట్ లేదు. ఒక సినిమా చేశాక ఆ ప్రాజెక్ట్ నుంచి వెంటనే డిటాచ్ అవుతుంటా. అలా మర్చిపోవడం నా అదృష్టమని భావిస్తా. 

'మత్తు వదలరా 3’ సినిమా సన్నాహాల్లో ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో సందీప్ కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నా. అది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నా. ఆ మూవీ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. 

నాకు భవిష్యత్తులో డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఈ సినిమా సెట్‌లో టైమ్ దొరికినప్పుడు కొత్త కాన్సెప్స్ట్ స్క్రిప్ట్స్, క్యారెక్టర్స్ ఆలోచించేదాన్ని. నరేశ్ అగస్త్య కూడా రైటర్ కాబట్టి అతనూ నా స్క్రిప్ట్స్ తయారీలో సపోర్ట్ చేసేవాడు.