19-12-2025 12:00:00 AM
అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ లవ్, యాక్షన్ డ్రామా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. 2026, మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాను న్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “ఇది చాలా పెద్ద సినిమా. రెండు భాషల్లో తీశాం. ఇది ప్రాపర్ తెలుగు, హిందీ సినిమా. ఒక తెలుగోడు ఒక హిందీ వోడు కలిసి చేసిన సినిమా.
నేను షానియల్ కలిసి రాశాం. మేమిద్దరం యూఎస్‌లో పెరిగాం. తను మన కల్చర్ అర్థం చేసుకొని నేను తన కల్చర్ అర్థం చేసుకుని ఒక హైబ్రిడ్ సినిమా చేశాం. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో వచ్చిందంటే కారణం సుప్రియ” అన్నారు.
హీరోయిన్ మృణాల్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నా మనసుకు చాలా దగ్గరయింది. నా హార్ట్ అండ్ సోల్ పెట్టాను. నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. శేష్ నా మోస్ట్ ఫేవరెట్. తను ట్రూ జెంటిల్మెన్” అని తెలిపింది. ‘సుప్రియ లేకపోతే ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యే ది కాదు. తను భయం లేని ప్రొడ్యూసర్. సినిమాకు కావలసిన చాలా ఫ్రీడమ్ ఇచ్చారు’ అని డైరెక్టర్ షానియల్ డియో చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనురాగ్ కశ్యప్, ఎడిటర్ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.