calender_icon.png 20 December, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రిపై కేసు పెట్టే కొడుకు కథ సన్ ఆఫ్

20-12-2025 01:46:52 AM

సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘S/O’ (సన్ ఆఫ్). బత్తల సతీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. “సన్ ఆఫ్’ రెగ్యులర్ ఫార్మాట్ కాదు.. ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ.  తండ్రీకొడుకుల మధ్య సాగే ఒక మంచి కథ చెప్పాడని నేను వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో చెబుతున్నా. దర్శకుడు జీనియస్.. అతను పూరీ జగన్నాథ్ అభిమాని. ఆయన ఎంతో కమిట్‌మెంట్‌తో ఈ సినిమా చేశారు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది” అన్నారు.

చిత్ర కథానాయకుడు సాయి సింహాద్రి మాట్లాడుతూ.. “ఎప్పటి నుంచో ఇలాంటి కథను తెరమీద చూపించాలని వుంది. ఈ కథ రియల్ లైఫ్‌లో నాకూ, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది. చాలా కథలు విన్నా. చివరకు ఈ కథకు కనెక్ట్ అయ్యా. ఈ కథ ఎంతో ఎగ్జుటైంగ్‌గా ఉంటుంది. ఇందులో డ్రామా, ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రతి కొడుకు.. తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. సీనియర్ నటుడు వినోద్‌కుమార్ ఈ చిత్రానికి ఎంతో వెనుదన్నుగా నిలిచి సినిమాను పూర్తి చేశారు. నేను చిరంజీవికి డైహార్ట్ ఫ్యాన్‌ని. ఈ సినిమాను ఆయనకు చూపించాలని వుంది” అన్నారు. దర్శకుడు సతీశ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం వినోద్ కుమార్‌కు కమ్ బ్యాక్ అవుతుంది. కచ్చితంగా ఆయన ఆల్బమ్‌లో ఓ ‘మామ గారు’ చిత్రంలాగా ఈ సినిమా కూడా ఉండిపోతుంది. మా హీరో సాయి సింహాద్రి నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడనేది చాలా స్ట్రాంగ్‌గా చూపించాం” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రం శీను, రిషి తదితరులు పాల్గొన్నారు.