11 May, 2026 | 10:14 AM

అదానీ అవినీతిపై చర్చించాలి

11-12-2024 01:50 AM

* మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ డిమాండ్

మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): అదానీ గ్రూప్ అవినీతి అంశం పై పార్లమెంట్‌లో చర్చించాలని పార్లమెంట్ ఆవరణంలో ఇండియా కూటమి నేతలతో కలిసి మహబూబాబాద్ ఎంపీ పొరిక బల రాం నాయక్ నిరసన వ్యక్తం చేశారు. ఈ  సందర్భంగా ప్రధాని మోదీ, అదానీ ఒకటే అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడు తూ.. దేశంలో మోదీ, -అదాని రాజ్యం నడుస్తుందని విమర్శించారు.