calender_icon.png 12 September, 2024 | 11:38 PM

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై చోరీలు

14-07-2024 05:35:13 AM

నలుగురు యువకుల అరెస్ట్

రాజన్న సిరిసిల్ల, జూలై 13 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా మారి దొంగతనాలకు అలవాటుపడిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం వేములవాడలో మీడియాకు వివరాలను వెల్లడిం చారు. బోయిన్‌పల్లి మండలం వర్ధవెల్లికి చెందిన మందల సాయి, మందల వెంకటేశ్, మందల వంశీ  ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డారు. డబ్బులు సరిపోక దొంగతనాలకు అలవాటు పడ్డారు.

అదే మండలం రాజన్నపేటకు చెందిన ఈడుగు కనుకయ్య ట్రాక్టర్ ను దొంగిలించారు. ట్రాక్టర్‌ను నిర్మల్ జిల్లా లోకేశరం మండలం మోడెం గ్రామానికి చేరుకొని గంజాయి పోశెట్టికి విక్రయించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ట్రాక్టర్, కల్టివేటర్, సిఫ్ట్ డిజైర్ కార్, బైకు, 5 మొబైల్ ఫోన్లను సాధీనం చేసుకొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.