యువశక్తి గులాబీ వైపు..
కాంగ్రెస్ హామీల గాలివానలో ఆశలు చెదిరిన వేళ.. కేసీఆర్ సిద్ధాంతాలకే యువత మద్దతు
రామాయంపేటలో బిఆర్ఎస్‌లో భారీ చేరికలు..
“యువతకు అండగా బిఆర్ఎస్ నిలుస్తుంది”: పద్మాదేవేందర్ రెడ్డి.
రామాయంపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ గులాబీ జోష్ కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్‌పై పెరుగుతున్న అసంతృప్తి, అమలు కాని హామీలతో విసిగిపోయిన యువత మరోసారి బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతోంది. మెదక్ జిల్లా రామాయంపేటలో శనివారం జరిగిన చేరికల కార్యక్రమం ఆ మారుతున్న రాజకీయ సంకేతాలకు నిదర్శనంగా నిలిచింది. గ్రామీణ యువశక్తి గులాబీ కండువా కప్పుకుని బిఆర్ఎస్‌కు బలం చేకూర్చింది. రామాయంపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కన్నపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన ఆమె.. యువతే తెలంగాణ భవిష్యత్తని, వారి ఆశయాలకు అండగా నిలిచేది బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో వగ్గు వంశీ (రఘుపతి), వెల్ముల రేవంత్, ముత్యం రంజిత్, ముత్యం సందీప్, వగ్గు బన్ని, ముత్యం విష్ణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి ఘాటుగా మాట్లాడుతూ... “తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ నాయకత్వమే. రైతు బంధు నుంచి రైతు బీమా వరకు, కల్యాణలక్ష్మి నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ వరకు ప్రతి పథకం ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోంది. ప్రజల ఆశలు నెరవేర్చగలిగే శక్తి బిఆర్ఎస్‌కే ఉంది” అని విమర్శించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకూ బిఆర్ఎస్‌పై విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్న ఆమె.. యువత పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పాక్స్ చైర్మన్ బాధే చంద్రం, మండల పార్టీ బాధ్యులు రాగి ఉమామహేశ్వర్, అక్కన్నపేట గ్రామ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, టౌన్ యూత్ అధ్యక్షుడు రొయ్యల నవీన్, మండల నాయకులు శ్రీకాంత్ సాగర్, మద్దూరి శ్రీనివాస్, తాటిపల్లి రాంకీ, దొమ్మట్ట శ్రవణ్ గౌడ్, వెల్ముల మహేశ్, బోడ శ్రీకాంత్ (బబ్లూ), పప్పయ్యగారి నర్సింలు, ఎల్లగారి రాజు, నాగరాజు, వంశీ సాగర్, పవన్ సాగర్, రాఘవేంద్ర, ప్రశాంత్ సాగర్, స్వామి, సిద్ధారములు తదితరులు పాల్గొన్నారు.






