28 June, 2026 | 3:11 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ఎన్నికల ఏర్పాటు పరిశీలించిన అదనపు కలెక్టర్

16-12-2025 07:18 PM

తానూర్,(విజయక్రాంతి): తానూర్ మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో బుధువారం జరగనున్న సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు మంగళవారం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించారు. స్థానిక జెడ్పిఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాల అవరణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎంపీడీఓ శ్రీధర్, తహసిల్దార్ మహేందర్ నాథ్, అధికారుల సమక్షంలో పంచాయతీల వారీగా ఆర్ఓలు 29 పిఓలు 248 ఏపిఓ,266, అబ్జర్వర్లు 10, రూట్ ఆఫీసర్లు 7, జోనల్ అధికారులు 2, ఎన్నికల అధికారులకు కేటాయించిన రూట్లు ప్రకారం ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు.

డిస్ట్రిబ్యూషన్స్ కేంద్రం వద్ద రాష్ట్ర ఎన్నికల పరిశీలిన అధికారిని అయిషా మస్రాత్ ఖనo, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సందర్శించి, ఎన్నికల అధికారులకు, పలు సలహాలు సూచనలు అందించారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటు వేసేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు.