15 April, 2026 | 11:11 AM

స్వప్న హాస్పిటల్ లో వైభవంగా పడిపూజ

16-12-2025 07:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని స్వప్న హాస్పిటల్ లో మంగళవారం అయ్యప్ప పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వైద్యులు నాలం స్వప్న శశికాంత్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకం దీపారాధన పూజా కార్యక్రమాలు నిర్వహించారు అయ్యప్ప నామస్మరణ భక్తి భజన పాటలు పాడారు. ప్రతి సంవత్సరం పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.