12-12-2025 12:22:31 AM
మునిపల్లి, డిసెంబర్ 11 :సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గురువారం మండల కేంద్రమైన మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు చేసి మాట్లాడారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈనెల 14వ తేదీన జరగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు.
అలాగే పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ హరినందన్ రావు, తహసీల్దార్ గంగాభవాని, ఎంపీఓ అండాలమ్మ, డిప్యూటీ ఎమ్మార్వో ప్రదీప్ , ఎంపీడీఓ కార్యాలయ సూపరిండెంట్ రామలింగం తదితరులు పాల్గొన్నారు.