12-12-2025 12:21:48 AM
కొత్తగూడెం,డిసెంబర్ 11, (విజయక్రాంతి): సింగరేణి ప్రధాన కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు , గురువారము కార్పొరేట్ పరిధిలోని అధికారులతో ఈనెల 23న కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నందు నిర్వహించే , సింగరేణి దినోత్సవ ప్రధాన వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ శ్రీ జి.వి.కిరణ్ కుమార్ సమీక్షను నిర్వహించారు. ఈ సంధర్భముగా 23న కార్పోరేట్ పరిధి లోని అన్ని డిపార్ట్మెంట్స్ సింగరేణి దినోత్సవ వేడుకలను, ప్రకాశం స్టేడియం నందు ఏర్పాటు చేయబోయే స్టాల్స్, ఇతర ఏర్పాట్ల గురించి డిపార్ట్మెంట్ల వారీగా చర్చించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
సింగరేణీయులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో ,పాల్గొనే సింగరేణి దినోత్సవ కార్యక్రమానికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అదే విధముగా హెడ్ ఆఫీస్ ను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అందుకు అవసరమయిన అన్ని ఏర్పాట్లను చేయవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ శ్రీ జి.వి.కిరణ్ కుమార్ తో పాటు బి.సీతారామమ్, ఏసిఎంఓ ఎం.ఉష,ఏజిఎం(ఈ&ఎం) ఎస్.వి.మురళీధర రావు, డిజిఎం(పర్సనల్) లు కేసా నారాయణ రావు, ముకుంద సత్యనారాయణ, వై.వి.ఎల్.వరప్రసాద్, డిజిఎం(సేఫ్టీ) విఎన్విఎస్‌ఆర్ శాస్త్రి, డిజిఎం (ఈ&ఎం) వర్క్ షాప్ ఎం.రాజ శేఖర్, డిజిఎం(జియాలజీ) ఎం.రాజ్ కుమార్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్త్స్రన్, డిజిఎం(ఐటి) ఎం.శ్రీనివాస రావు, మేనేజర్(ఫారెస్ట్రి) ఆర్బి.డేవిడ్ అభిలాష్, సంబంధిత డిపార్ట్మెంట్ ల అధికారులు పాల్గొన్నారు.