12-12-2025 01:24:01 PM
క్షమాపన చెప్పకపోతే.. కోర్టుకు ఈడుస్తా: కవిత
పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో నాకు సంబంధం లేదు
హైదరాబాద్: కాంగ్రెస్ తో అంటకాగుతున్నానని తనపై ప్రచారం చేస్తున్నారని జాగృతి వ్యవస్థాపకురాలు కవిత అన్నారు. వెకిలి ప్రయత్నాలు చేస్తున్న గుంట నక్కలు జాగ్రత్త ఉండాలని హెచ్చరించారు. కేసీఆర్ తో పాటు ఎవరైనా ఒక్క పనైనా అడిగారా? దమ్ముంటే నా ఆరోపణలకు సమాధానం ఇవ్వండి? అని కవిత ప్రశ్నించారు. నాకు ఎవరితోనూ అవగాహన లేదు, వ్యాపారాలు లేవన్నారు. మాధవరం కృష్ణారావుకు(Madhavaram Krishna Rao) కూడా నోటీసులు పంపుతున్నట్లు కవిత తెలిపారు. వారం లోగా క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని కవిత హెచ్చరించారు.
ఏవీరెడ్డితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని(Pochampally Srinivas Reddy) భూ లావాదేవీలు ఉన్నాయని, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పొద్దున లేస్తే కేటీఆర్ వద్ద ఉంటారని కవిత ఆరోపించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎవరి బినామీనో చెప్పాలి డిమాండ్ చేశారు. మాధవరం కృష్ణరావు చాలా చిన్న వ్యక్తి. మాధవారం ఎనుక ఉండి గుంట నక్క నడిపిస్తోందన్నారు. కృష్ణారావు బాధితులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ప్రణీత్, ప్రణవ్ కంపెనీల్లో కృష్ణారావు కుమారుడు డైరెక్టర్ అన్నారు. ప్రణీత్, ప్రణవ్ కంపెనీల విల్లాలు అన్ని కబ్జాల్లో కట్టినవేనని కవిత ఆరోపించారు. వెంచర్ మద్యలోని10 ఎకరాల చెరువు ఆరు ఎకరాలకు ఎలా తగ్గిందన్నారు. చెరువులోపల విల్లాలు వేసుకోవడానికి అది మీ అయ్య జాగీరా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), హైడ్రా ధైర్యం ఉంటూ ఆ చెరువు సంగతి చూడాలని కోరారు. కేటీఆర్ హయాంలో అభివృద్ధి పేరిట చెరువునే మింగేశారని సంచలన ఆరోపణలు చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తనకు సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ధిల్లీ, నిజామాబాద్ కే పరిమితమయ్యానన్నారు. పార్టీ నుంచి వెళ్లగొట్టారు కదా.. ఇంకా కళ్లు చల్లబడలేదా? అని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీకి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్ ద్వారాలు తెరుస్తోందన్నారు. నాపై, నా భర్తపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో(BRS Government) చాలా తప్పిదాలు జరిగాయని వివరించారు. బీఆర్ఎస్ దొంగ దారులను కాంగ్రెస్ సెలెక్టివ్ గా రహదారులు మార్చుకుంటుందోన్నారు. దేవుడి దయ వల్ల నేను ముఖ్యమంత్రి అవుతానని కవిత తేల్చిచెప్పారు. 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికి తీస్తానని కవతి స్పష్టం చేశారు.