జిల్లాలో డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు
కిరాణా, పాన్ షాప్స్, బస్టాండ్ ప్రాంతాలలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీలు
మత్తు పదార్థాల విక్రయాలు,రవాణాపై కఠిన చర్యలు తప్పవు
ఎల్లారెడ్డి పేట,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండలంలోని కిరాణా, పాన్ షాప్స్, బస్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు అధికారులు నార్కోటిక్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన, భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.






