అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ శ్రీజ
20-06-2026 01:33 AM
మధిర, జూన్19 (విజయక్రాంతి): మధిర మున్సిపాలిటీ పరిధిలోని మహాప్రస్థానం, అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ. ఈ సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో నాణ్యత లోపించకూడదని త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ కమిషనర్ సామ్యూల్‌ఇజ్రాయిల్ పాల్, మున్సిపాలిటీ చైర్పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్ పర్సన్ కోనా దని ,17వ వార్డు కౌన్సిలర్ ములకలపల్లి వినయ్, వాటి కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.






