calender_icon.png 15 December, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

10-12-2025 12:00:00 AM

హాజరైన జిల్లా అధికారులు, సిబ్బంది

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 09(విజయక్రాంతి): జిల్లా సమీకృత కార్యాలయాల స ముదాయంలో రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కాగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటిస్తూ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, సీపీఓ శ్రీనివాసాచారి, డోర్స్ అధ్యక్షుడు డీవీ హెచ్ ఓ రవీందర్ రెడ్డి, ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.