15-12-2025 11:23:38 AM
హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్(Hayathnagar Police Station) పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాలనీ సమీపంలో రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఎంబీబీఎస్(MBBS student) ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఢీకొట్టింది. మృతురాలిని ఐశ్వర్యగా గుర్తించారు. ఈ ప్రమాదంలో వైద్య విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె తండ్రికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే రోడ్డుపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐశ్వర్య మృతితో వారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.