15-12-2025 11:43:24 AM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దీంతో ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలు అమలు చేశారు. పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పొంగమంచు వల్ల 40 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఏక్యూఐ(Air Quality Index) 450 పాయింట్లకు పడిపోయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ఇతర విమానాశ్రయాలలో దట్టమైన పొగమంచు అలుముకుందని, దీని వలన దృశ్యమానతపై తీవ్ర ప్రభావం పడుతుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది. విమానాశ్రయానికి వెళ్లే ముందు, దయచేసి సంబంధిత విమానయాన సంస్థతో తాజా విమాన స్థితిని తనిఖీ చేయండి. విమానాశ్రయ వెబ్‌సైట్/యాప్‌లో విమాన సమాచారాన్ని తనిఖీ చేయండి. అదనపు ప్రయాణ సమయాన్ని అనుమతించమని ప్రయాణీకులను కోరుతూ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత అంటూ మంత్రిత్వ శాఖ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.