calender_icon.png 24 December, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక పూజలు నిర్వహించిన అడిషనల్ కలెక్టర్

09-10-2024 12:23:22 PM

కొండపాక (విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శివాలయం వద్ద ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం రోజున సరస్వతి అమ్మవారిగా దర్శనమిచ్చారు. అమ్మవారి మండపానికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఉషోదయ యూత్ సభ్యులు అడిషనల్ కలెక్టర్ కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ యూత్ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.