15 March, 2026 | 6:25 PM

Breaking News

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •  

ప్రియుని వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

09-10-2024 12:15 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన జక్కం అంజలి (18) అనే యువతి ప్రియుని కట్నం వేధింపులు భరించలేక ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడిందని ఎస్సై చుంచు రమేష్ బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జక్కం అంజలి చిన్న గుడిపేట గ్రామానికి చెందిన యాటకారుల రాజు (24) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. మూడు నెలలుగా రాజు రూ 5 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని అంజలికి ఫోన్ చేస్తూ వేధించాడు. అంజలిపై అనుమానం పెంచుకొని ఇంటికి వచ్చి పలుసార్లు కొట్టాడు. రాజు నిత్యం వేధిస్తున్న తీరుకు మనస్థాపం చెందిన అంజలి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి జక్కం విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.