calender_icon.png 10 January, 2026 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించండి

08-01-2026 01:23:40 AM

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ టౌన్, జనవరి 7: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రతి సోమవారం జరిగే సాధారణ ప్రజావాణి కి రాలేక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు,దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతినెల *మొదటి బుధవారం స్థానిక అర్భన్ తహిసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె వృద్ధులు, దివ్యాంగుల నుండి వారు ఎదుర్కొంటున్న సమస్యల పై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించారు.

ఇందులో తనకు గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని ఒక దివ్యాంగుడు కోరగా, తనకు ఇల్లు లేదని ఇందిరమ్మ ఇళ్ల కేటాయించాలని ఒక వృద్ధుడు కోరాడు. వికలాంగులకు కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని వికలాంగుల సంఘం విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం గతంలో వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో నర్సింహులు, ఆర్డీవో నవీన్, ఆర్టీసీ అధికారి వహీద్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, తదితరులు పాల్గొన్నారు.