24 August, 2026 | 1:26 PM

ఫీజు రీయింబర్స్మెంట్పై BJP బడాయ్: ఆది శ్రీనివాస్

24-08-2026 12:40 PM

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ మెంట్ పై బీజేపీ బడాయి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) ఆరోపించారు. దీక్ష పేరుతో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(BJP President Ramchander Rao) హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) రూ. 8 వేల కోట్ల బకాయిలు పెట్టిందని లెక్కచెప్పారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)పై బీజేపీ ఎందుకు పోరాడలేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. గత బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థులపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదని తేల్చిచెప్పారు. నీట్ యూజీ పేపర్ లీక్(NEET UG paper leak)తో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పేపర్ లీక్ లేకుండా పరీక్షలు నిర్వహించామని వివరించారు. 

పీజు బకాయిలపై బీజేపీ లడాయి

అటు బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రెండు రోజుల దీక్ష చేపట్టారు. రూ. 15 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.