5 June, 2026 | 1:28 AM

కేంద్ర క్యాబినెట్‌లో ఆదిలాబాద్ ఎంపీ?

05-06-2026 12:45 AM
  1. దక్షిణ భారత్ నుంచే ఏకైక ఆదివాసీ సభ్యుడు
  2. గోడం నగేష్ వివరాలు సేకరించిన పీఎంవో!

ఆదిలాబాద్/బోథ్, జూన్ 4 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌కు కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆది వాసీ నాయకుడు, రాజకీయ వివాదా రహితుడుగా, మృదు స్వభావిగా పేరున్న ఈయనకు సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు కేంద్రంలోని పెద్దలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి గత పది రోజుల క్రితం ఎంపీకి సంబంధించిన పూర్తి బయోడేటా, ఆయన రాజకీయ అనుభవం, చేపట్టిన పదవులకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు సమాచారం.

అతిచిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారి మంత్రి పదవి చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ, దివ్యాంగుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ గ్రూపు విభేదాలకు దూరంగా ఉం టూ.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే మనస్త త్వం ఉన్న నగేష్‌కు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది.

ఏకైక ఆదివాసీ ఎంపీ

దక్షిణ భారతదేశం నుంచి గెలుపొందిన ఏకైక ఆదివాసీ ఎంపీ కావడంతో పాటు గిరిజన సమస్యలపైన పట్టు ఉన్న నగేష్‌కు కేంద్రమంత్రి బాధ్యతలు కట్టబెడితే ఆదివాసీలకు, గిరిజనులకు న్యాయం చేసినట్లు ఉం టుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జమ్మూ కాశ్మీర్, కేరళం, పంజాబ్ రాష్ట్రాలలో గిరిజన చట్టాలపై జరిగిన సమీక్షల్లో ఎంపీ పాల్గొన్నా రు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బీజేపీ మరింత పట్టు సాధిస్తుందని భావిస్తున్నారు.