23-01-2026 06:22:24 PM
జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మండల కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 2026–27విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మధుకర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు వంటి సౌకర్యాలు కల్పిస్తూ విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ అవకాశాలను వినియోగించుకొని విద్యార్థులు భవిష్యత్తును మెరుగుపర్చుకోవాలని సూచించారు.
ప్రస్తుతం 5, 6, 7తరగతుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయని, అర్హులైన పిల్లలను తప్పకుండా చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమానికి ముందు జామా మసీదు పరిసరాల్లో ఉపాధ్యాయులతో కలిసి ప్రజలకు ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సోఫియా నాజ్, సన్‌రైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ జమీల్, మౌలానా అబూబకర్, మౌలానా దస్తగిర్‌తో పాటు స్థానికనాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 7661800798, 9154238615 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.