calender_icon.png 23 January, 2026 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో పని చేసి జాతర సక్సెస్ చేద్దాం

23-01-2026 06:56:00 PM

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ,(విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్, ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గత జాతర సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, కారణాలతో పాటు, పోలీస్, ఆర్టీసీ సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. ఈ సందర్బంగా మేడారం జాతర ఆర్టీసీ శాఖ చేసిన ఏర్పాట్లపై  ఆర్టీసీ రీజినల్ మేనేజర్, విజయ భాను, పోలీస్ కమిషనర్ కు పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మేడారం తరలి వస్తున్న భక్తుల రద్దీని గమనిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు.హన్మకొండ బాలసముద్రం నుండి  జాతరకు వెళ్లే బస్సులకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలని. అదే విధంగా నగరంలో ఏదైనా ట్రాఫిక్ అంతరాయం కలిగితే జాతరకు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల నుండి తరలించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశం లో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, ఆర్టీసీ , ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, జానీ న్సర్సింహులు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్. యం లు భాను కిరణ్, మహేష్, డిపో మేనేజర్లు రవి చందర్, అర్పిత,ధర్మాసింగ్, ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు సీతా రెడ్డి, పిట్టల వెంకన్న, సుజాత ఇతర పోలీస్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.