calender_icon.png 23 January, 2026 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసంత పంచమి.. చిన్నారులకు అక్షరాభ్యాసం

23-01-2026 06:14:04 PM

అచ్చంపేట: వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేసిన చిన్నారులు త్వరగా చదువు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అర్చకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అచ్చంపేటలోని సీతరాళ్లగుట్ట సరస్వతిదేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా పద్మశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు దాసపత్రి శకుంతల ఆధ్వర్యంలో సరస్వతి మాతకు అభిషేక  పూజలు నిర్వహించారు. అమ్మవారికి 25 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. ఆలయ అర్చకులు చిదంబర శాస్ర్తి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ మాఘమాసం శుక్ల పక్షం.. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల నాలుకపై అమ్మవారు నిలిచి విద్యను త్వరగా నేర్చుకోవడానికి మనసులో నిలిచి ఉండడానికి ఆశీర్వదిస్తుందని అన్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్ పూజలో పాల్గొన్న వారికి పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో గుర్రం హైమావతి, గంజి నిర్మల, కోట ప్రశాంతి, ఇమ్మడి రాజేశ్వరి, దాసు జంగమ్మ, బాలకిష్టమ్మ, నారాయణమ్మ, పద్మ, శ్రీదేవి, బాలమణి, మానస, సావిత్రి, దాసు శ్రీనివాసులు, వనం వేణు, రంగ రాజు, మాకం శేఖర్ లు పాల్గొన్నారు.